![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -296 లో... తనని తన కూతురిని జ్యోత్స్న చంపాలనుకుందని దీప కోపంగా జ్యోత్స్న దగ్గరికి వచ్చి రెండు చెంపలు వాయిస్తుంది. ఎందుకు నా కూతురిని కొడుతున్నావని సుమిత్ర అనేసి.. దీపని కొడుతుంది. నా కూతురు ఒంట్లో బాగోలేక ప్రొద్దున నుండి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుందని సుమిత్ర అంటుంది. తన నిజంగానే నన్ను నా కూతురుని చంపాలనుకుందని దీప ఆవేశంగా మాట్లాడుతుంది.
గతంలో ఇలా ఒకసారి జరిగింది అప్పుడు నీ మాజీ భర్త ఇలా చేసాడు. ఇప్పుడు కూడా వాడే చేసి ఉంటాడని శివన్నారాయణ అంటాడు. ప్రొద్దున నుండి జ్యోత్స్న ఇంట్లోనే ఉంది కదా.. లేదంటే దీప మాటలని నమ్మేవాడిని అని దశరథ్ అనుకుంటాడు. నువ్వు నన్ను కాపాడవ్ అన్న ఒకే ఒక కారణంతో నిన్ను వదిలిపెడుతున్నా.. అసలు నా కూతురు ఇదంతా చేసింది అనడానికి ఆధారం ఏమైనా ఉన్నాయా అని దీపతో సుమిత్ర కఠినంగా మాట్లాడుతుంది. నా కూతురు చూసింది అంటే నమ్మడం లేదు కదా.. ఆధారాలతో వస్తానని దీప ఆవేశంగా బయటకు వస్తుంది. వెనకాలే దశరథ్ వచ్చి.. దీప ఏం జరిగిందో తెలియదు కానీ నువ్వు ఆధారాలు తీసుకొని వస్తే ఒకవేళ జ్యోత్స్న నిజంగానే తప్పు చేస్తే ఇక ఈ రెండు కుటుంబాలు ఎప్పటికి కలవవు.. జ్యోత్స్న పెళ్లితో ఈ రెండు కుటుంబాలని కలపాలని ట్రై చేస్తున్నాను.. నువ్వు ఇలా చేస్తే ఇక ఎప్పుడు ఈ కుటుంబాలు ఎప్పటికి కలవవు.. నిజంగానే నా కూతురు తప్పు చేసి ఉంటే తన తరుపున నేను క్షమాపణ అడుగుతున్నానని దీపని దశరథ్ రిక్వెస్ట్ చేస్తాడు.
దీప ఇంటికి వస్తుంటే కార్తీక్ ఎదురు పడుతాడు. శౌర్య చెప్పింది ఇదంతా చేసింది జ్యోత్స్ననే అంట కదా.. పద వెళదాం.. అడుగుదామని దీపతో కార్తీక్ అంటాడు. అక్కడ నుండే వస్తున్నా తన సంగతి చూసే వస్తున్నానని దీప అంటుంది. నువ్వు వెళ్లి చెప్తే అక్కడ అందరు నమ్ముతారా ఒక అత్త తప్ప ఎవరు నమ్మరని కార్తీక్ అనగానే.. ఇప్పుడు ఆవిడ కూడా నమ్మలేదు. నా కూతురు ఇలా చేసింది అనడానికి ఆధారాలు ఏంటని ఆవిడ అడుగుతున్నారు. ఎక్కడ నుండి తీసుకొని వస్తామని దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |